
పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన తెప్ప వికాస్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మందస మండలం షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం నాయకులు లోహరిబంద గ్రామానికి విచ్చేసి తెప్ప వికాస్ ను అభినందించారు.పుష్పగుచ్చం అందించి ఆర్థిక సహాయం అందజేశారు.పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వికాస్ సైనింగ్ స్టార్ అవార్డు దక్కించుకున్నారు.లోహరిబంధ ప్రభుత్వ పాఠశాలలో 600 మార్కులకు గాను 567 అత్యధిక మార్కులు సాధించి స్కూలు టాపర్ గా నిలిచాడు.అత్యధిక మార్కులు సాధించిన తెప్ప వికాస్ కు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్,జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా అత్యుత్తమ ప్రతిభా అవార్డు అందజేసిన సంగతి విధితమే.ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి మోహన్ రావు,ప్రధాన కార్యదర్శి సంక కాళిదాసు,ఆర్గనైజింగ్ సెక్రెటరీ పిలక శ్రీనివాస్ రావు తదితరలు గ్రామానికి విచ్చేసి భినందించారు.ప్రశంస పత్రం తో పాటు నగదు బహుమతి అందజేశారు.విజయవాడ సమీపంలోని నిమ్మకూరు ఏపీఆర్జేసీ కళాశాలలో ఎంపీసీ విభాగంలో సీటు దక్కించుకున్నాడు.