
మందస రోడ్డు పితాతోలి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కొని చికిత్స పొందుతూ మరణించిన
నర్తు వెంకట్ రమణ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేందుకు నేనున్నానంటూ దాతలు ముందుకు వస్తున్నారు. ఆపదలో ఉంటే తామంతా ఒక్కటై ఆదుకుంటామని గ్రామానికి చెందిన యువకులు స్పందిస్తున్న తీరు మానవతావాదులను ఆలోచింపచేస్తుంది.మందస రోడ్డు పితాతోలి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై చికిత్స పొందుతూ నర్తు వెంకట్ రమణ మరణించిన రోజు నుంచి యువకులు భరోసాగా నిలబడ్డారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతమంత మాత్రమే ఉండడం భార్య అనారోగ్య సమస్యలతో కృంగిపోవడం అందరిని కలిసి వేసింది. నార్త్ వెంకటరమణ కుటుంబానికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం చేసేందుకు నిర్ణయించుకున్నారు. 2008-2009 బ్యాచ్ కి చెందిన తోటి విద్యార్థులు ఆయన కుటుంబానికి తమ వంతు సహాయంగా మొత్తం విద్యార్థులు కలిసి 72,000 జమ చేసి ఆ కుటుంబానికి అండగా అందజేశారు. కుటుంబ సభ్యులు సమక్షంలో వాళ్ళ పాప భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద ఈ డబ్బులు జమ చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. భవిషత్ లో ఏదైనా అవసరం ఉంటే క్లాస్మేట్స్ అందరం మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అందుబాటులో ఉన్న పిన్నింటి శంకర్, రాపాక నరేష్, ముడిమించి వీరాస్వామి, మామిడి జానకిరావు, అందాల డిల్లేశ్వరరావు, ముడిమించి తిరుమల, తాళ్ళ కృష్ణవేణి, పిన్నింటి లక్ష్మీ, మురపాల పవిత్ర ఉన్నారు. మృతుని కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులకు గొరకల పాపారావు అభినందించారు. అంతకుముందు గ్రామానికి చెందిన యువకులంతా ఏకమై లక్ష పైబడి ఆర్థిక సహాయం అందజేసారు. అంతకుముందు మన్యం శ్రీనివాస్ యాదవ్ మృతుని కుటుంబానికి పరామర్శించి 30 వేల నగదు అందజేశారు. అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న భార్య వైద్య ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్న యువకులను పలువురు అభినందిస్తున్నారు.
భావోద్వేగానికి గురైన బాధ్యత కుటుంబ సభ్యులు
ఆపదలో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి దాతలు అండగా నిలుస్తున్నారు.కుటుంబ పెద్ద మృతితో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.దాతల సహకారానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.క్లిష్ట సమయంలో అండగా నిలవడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు.