కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలి
సైబరాబాద్ సీపీకి లోక్ జనశక్తి పార్టీ నేతల ఫిర్యాదు

విశాల జ్యోతి శేరిలింగంపల్లి
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌ను బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్–జనశక్తి మజ్దూర్ సభ అధ్యక్షుడు జి. సురేందర్ కోరారు.ఈ మేరకు శనివారం సంగారెడ్డి జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు ఆమీర్‌తో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి ని కలిసి ఫిర్యాదు చేశారు. చిరాగ్ పాశ్వాన్‌కు హాని తలపెడతామని హెచ్చరికలు నేపథ్యంలో రక్షణ బలోపేతం చేయాలని కోరారు. ప్రాణహాని ఉందంటూ బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు సురేందర్ తెలిపారు.సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా రమేష్‌ను కలిసిన సందర్భంగా పూలగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్ సభ్యులు శివ, వికాస్ యాదవ్, కైఫ్, పింటూ తదితరులు పాల్గొన్నారు.