వివాదాస్పద పుస్తక ప్రచురణకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి పిర్యాదు విదసం ప్రతినిధులు
రాజ్యాంగ నిర్మాతపై తప్పుడు, అభ్యంతరకర కథనాలు
రాజ్యాంగ విలువలను గౌరవించే ప్రజల్లో తీవ్ర ఆందోళన
ప్రచురణ చేయకుండా ఆపాలని విజ్ఞప్తి

విశాల జ్యోతి న్యూఢిల్లీ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలతో పుస్తకాన్ని ప్రచురించనున్నట్లు ప్రకటించిన హమారా ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విదసం ప్రతినిధులు రాష్ట్రపతి కార్యాలయంలో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ బూసి వెంకట్ రావు తెలిపారు.హమారా ప్రసాద్ అంబేద్కర్‌ను అవమానించేలా, ఆయన చరిత్రను వక్రీకరించేలా “The Hidden Side of Ambedkar’s History” అనే శీర్షికతో పుస్తకాన్ని రూపొందించి,ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారని డాక్టర్ బూసి ఆరోపించారు. అంబేద్కర్ వంటి రాజ్యాంగ నిర్మాతపై తప్పుడు, అభ్యంతరకర కథనాలను ప్రచారం చేయడం పట్ల రాజ్యాంగ విలువలను గౌరవించే ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.ఈ అంశంపై వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజల తరఫున తమ ప్రతినిధివర్గం నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి పిటిషన్ సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్రపతి కార్యాలయంలోని సెంట్రల్ రిజిస్ట్రీలో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు.రెండు రోజుల్లో రాష్ట్రపతి కార్యాలయానికి పిటిషన్ చేరేలా అత్యవసరంగా పరిశీలనకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి కార్యాలయ సెక్రటరీ హామీ ఇచ్చారని తెలిపారు. రెండు రోజుల్లో పిటిషన్ రాష్ట్రపతి పరిశీలనకు చేరేలా అర్జెన్సీ ఫైల్ ప్రక్రియను కొనసాగిస్తామని కార్యాలయ అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.పలువురు కేంద్ర మంత్రిత్వ శాఖలకు కూడా ఫిర్యాదులు ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్న బ్రిక్స్ సమావేశాల కారణంగా న్యాయశాఖ, బ్రాడ్‌కాస్టింగ్ అండ్ పబ్లిషింగ్, సామాజిక న్యాయశాఖలకు చెందిన మంత్రులతో ముందుగా కోరిన అపాయింట్మెంట్లు రద్దయ్యాయని డాక్టర్ బూసి తెలిపారు. అయినప్పటికీ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు విదసం ప్రతినిధివర్గం ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఉన్నత మంత్రిత్వ స్థాయిలో మరికొన్ని పిటిషన్లు సమర్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ చరిత్ర, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వ సంస్థలు తగిన విధంగా స్పందించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రజలు తమకు మద్దతు, ఆశీర్వాదం అందించాలని డాక్టర్ బూసి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం, సామాజిక న్యాయం, డాక్టర్ అంబేద్కర్ ఆలోచనా విధానాల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తాం అని ఆయన పేర్కొన్నారు.