టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్.
భారీగా మద్దతుదారులతో కలిసి తెలంగాణ రక్షణ సేనలో చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవిత
వాసిలి చేరికపై శేర్లింగంపల్లిలో బి ఆర్ ఎస్ లో చర్చ

విశాల జ్యోతి శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలంగాణ రక్షణ సేనలో చేరారు.బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు,మద్దతుదారులతో కలిసి బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయనికి భారీ ఎత్తున తరలి వెళ్లరు.ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన చంద్రశేఖర్ ప్రసాద్,ఆయన సతీమణి నివేదిత నాయకులు రఘురాం, రవికృష్ణతో పాటు 250 మంది పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఇంతకాలం బి ఆర్ ఎస్ పార్టీకి ఉద్యమ సమయంలో వెన్నంటూ ఉండి అహర్నిశలు కృషి చేసిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆయన సతీమణి నివేదిత ఆధ్వర్యంలో భారీగా తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు.పార్టీలో చేరిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందని కవిత స్పష్టం చేశారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు.టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తమ వంతుగా కృషి చేస్తామని ఆయన అన్నారు.పార్టీ క్రమశిక్షణతో ముందుకు సాగుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య,వైద్యం అందించాలన్నదే ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. విద్యా,వైద్యం పేదవాడికి భారంగా మారిందని.ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఉండవు. ప్రైవేట్ పాఠశాలలకు వెళితే అత్యధిక ఫీజులు,సర్కారు వైద్యం సరిగా అందడం లేదని ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షల రూపాయలు చెల్లించుకోలేని పరిస్థితి నిరుపేదకు లేదని విచార వ్యక్తం చేశారు.విద్య ,వైద్యం పేదవాడి పట్ల గుదిబండగా మారిందని ఈ పరిస్థితులలో మార్పు రావాలంటే తెలంగాణ రక్షణ సేన తోనే సాధ్యమని తెలిపారు.ప్రశ్నించే నాయకత్వానికి గుర్తింపు లభిస్తుందని తెలిపారు.స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు కావస్తున్న గుడు కోసం నిరుపేద నిరీక్షించే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
