రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రక్షణ సేన నేతకు గాయాల పరామర్శించిన వాసవి చంద్రశేఖర్ ప్రసాద్

 

శేరిలింగంపల్లి: విశాల జ్యోతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్ చారిని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.నిన్న రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా లింగంపల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయాలు కాగా, కుడి కంటి పైభాగంలో 13 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్చార్జి వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ శుక్రవారం ఉదయం అశోక్ నగర్‌లోని శ్రీ వేద హాస్పటల్‌కు వెళ్లి విష్ణువర్ధన్ చారి,అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దు” అంటూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అలాగే వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25,000 ఆర్థిక సహాయం అందించారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *