శ్రీకాకుళం జిల్లా మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన దళితులకు కేటాయించిన ఇల్లు స్థలాలపై గ్రామానికి చెందిన కొంత మంది కన్ను పడింది. దాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని అడ్డుకోవాలని మందస షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం నాయకులను బాధితులు ఆశ్రయించారు. తమకు అండగా నిలవాలని ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.25 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భూములు కొనుగోలు చేసి దళితులకు ఇళ్ల స్థలాల కోసం భూముల కేటాయించారు. అత్యంత నిరుపేదలు నివాసముంటున్న దళిత కుటుంబాలలో ఇప్పటికీ చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు.ఇళ్లు లేని నిరుపేద దళిత కుటుంబాలకు సర్వే నంబర్ 48/5,48/6 లలో 2.45 ఎకరాలు ఇళ్ల స్థలాలు కోసం ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన స్టాండింగ్ ఆర్డర్ నంబర్ 21 పేర 7 క్లాజ్ (11)121/2002/ఏ ప్రకారం
తేదీ 02/01/2003 నాడు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో సుమారు 42 మందికి పట్టాలు పంపిణీ చేయగా మరో 20 కుటుంబాలకు ఇంకా పట్టాలు ఇవ్వాల్సి ఉంది. మండల రెవెన్యూ అధికారుల సర్వే నిర్వహించిరెండు సెంట్లు చొప్పున కేటాయించారు. మిగతా
స్థలములో గుడి, బడి, ఆసుపత్రి ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు వినియోగించుకొనే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించుకునే స్థలమేది. ఈ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.అనేక త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు అక్కడ చెట్లు సగభాగం తొలగించి ఇళ్ల స్థలాలు కోసం స్వచ్ఛందంగా దళితులే ముందుకు వచ్చి చదునుచేసుకొని ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఏ రాజకీయ పార్టీ నాయకుడు గాని ప్రజా ప్రతినిధులు గాని సహకరించలేదు. తాజాగా ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు స్థలం పూర్వ యజమానులతో కలిసి కుట్రకు తెరలేపారు. ఈ భూమి రైతుల నుంచి సేకరించినప్పుడే భూ హక్కుదారులకు పరిహారం చెల్లించి నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ భూములపై ప్రభుత్వానికి తప్ప వేరే ఎవరికీ ఎలాంటి హక్కులు లేవు. అయినా దళితులను భయభ్రాంతులను గురిచేసి ఈ భూములు స్వాధీనం చేసుకునేందుకు గ్రామానికి చెందిన అధికార పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దళితులకు అండగా ఉండాల్సింది పోయి భక్షించేందుకు సిద్ధపడ్డారు.భూమి కోల్పోయిన బాధితులు గ్రామ కమిటీకి కలిసారని వారి విజ్ఞప్తి మేరకు సమావేశం నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. వాస్తవంగా భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అంటే ప్రభుత్వం తో ఫైట్ చేయాలి.అలా కాకుండా గ్రామ కమిటీ సమావేశం తో ఘర్షణ వాతావరణం సృష్టించడం తప్ప మరో ప్రయోజనం లేదు. ఇలా చేయడం అంటే భూమి కోల్పోయిన బాధితులకు మభ్యపెట్టడమే అవుతుంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ నేతృత్వంలో భూమిని సేకరించారు.ఈ వ్యవహారం జరిగి మూడు దశాబ్దాలు పూర్తవుతుంది.. భూమి కోల్పోయిన సదరు రైతును ప్రభుత్వ స్వాధీనం చేసుకున్న భూమిపై వివిధ మార్గాలలో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం తో పోరాటం చేయాల్సింది పోయి
ఇలా చేయడం అంటే దళితులను ద్రోహం చేయడం కిందకే వస్తుంది. ప్రభుత్వం కేటాయించిన స్థలం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ భూమి మూడు దశాబ్దాల క్రితం కేటాయించింది. అనేక పోరాటాల ఫలితంగా దళితులు ఇల్లు పట్టాలు సంపాదించుకున్నారు.క్రమంగా ఇల్లు నిర్మించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏ ఒక్క గ్రామ నాయకుడు దళితుల పక్షాన నిలబడలేదు. ఇళ్ళ పట్టాల కోసం గాని ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గృహ నిర్మాణ పథకాలు వర్తించే విషయం లో సహకరించలేదు.కానీ బలవంతంగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కుయుక్తుల చేయడం పట్ల దళితులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

దళితులే త్యాగం చేయాలా
లోహరిబంద గ్రామంలో భావి (నుయ్య)నిర్మాణానికి, రోడ్ల కోసం రెండు ఎకరాలు పైబడి స్థలాన్ని అప్పట్లో స్వచ్ఛందంగా దానం చేశారు. దళితుల భూముల మీదగా రోడ్డు నిర్మించారు.మురికి కోపంగా ఉన్న కల్వర్టు సొంత నిధులతో నిర్మించారు.గ్రామ కంఠం భూములు ఉన్న అంబేద్కర్ విగ్రహం అక్కడ కట్టకుండా అడ్డుకుంటే దళితులు సొంత స్థలం లో నిర్మించుకున్నారు.ఈ విషయం పై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు విగ్రహావిష్కరణ రోజు అభ్యంతర వ్యక్తం చేశారు. ప్రధాన కూడలిలో ఉండాల్సిన విగ్రహం ఒక మూల పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కీలకమైన విషయాలలో స్పందించిన గ్రామ కమిటీ నాయకులు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిపై అత్యుత్సాహం ప్రదర్శించడం వెనుక ఉన్న మతలబు ఏమిటో అంతుచిక్కడం లేదు.రానున్న ఎన్నికలలో తమకు ద్రోహం తలపెట్టాలనుకున్న పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.