పని మనిషిగా ప్రవేశం.. బంగారం కోసం దారుణం ఒంటరి మహిళను హత్య చేసిన కిలాడీ

దుండిగల్ (విశాల జ్యోతి)  గాగిల్లాపూర్ లో జరిగిన వృద్ద మహిళ హత్య కేసును 24 గంటలలో దుండిగల్ పోలీసులు.. ఛేదించారు. నిందితురాలను గుర్తించడంలో సీసీ కెమెరా కీలకంగా మారింది.అనుమానితల కదలికలను సమీప సి.సి కెమెరాల రికార్డ్ కావడి దర్యాప్తు సులభతరం చేసింది. సుశీల ఇంటి మరమ్మత్తుల పనుల కోసం
పన మనిషిగా వచ్చిన కవిత హత్యకు పధక రచన చేసింది. ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె ఉన్న సుశీల ఇక్కడ ఒంటరిగా ఉంటుంది. కల్లు తాగి అలవాటు ఉన్న ఆమెకు కవిత దగ్గర అయింది. కవిత కల్లు తీసుకొని వచ్చి ఇరువురు కలిసి తాగేవారు. సుశీల ఒంటిపై చెవి కమ్మలు, ముక్కుపుడక చూసిన కవిత దురాలోచన పుట్టింది. వృద్ధ మహిళ ఒంటరిగా ఉండడం చూసి
దొంగలించేందుకు హత్య చేసినట్లు దర్యాప్తులో వెళ్లడైంది.దొంగలించిన బంగారాన్ని ఓ బంగారు షాప్ లో విక్రయించి సొమ్ము చేసుకుంది.కవిత మద్యం మత్తులో సోఫాకి ఉండే చెక్కకి సుశీలమ్మ తలని బలంగా మోది ఆతరువాత బండ రాయితో బలంగా కొట్టింది.అప్పటికి చనిపోలేదని అనుకోని దిండుతో ఊపిరాడకుండా చేసింది.చనిపోయిందని నిర్ధారించుకొని సుశీల మెడలో ఉన్న ఆభరణాలు తీసుకొని బయటికి వెళ్లిపోయింది
హత్య చేసిన అనంతరం సుశీలమ్మ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ని ఎత్తుకెళ్లిన కవిత..మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఇసుకలో పాతిపెట్టింది.సిగ్నల్ ఆధారంగా మొబైల్ ఫోన్ ని పోలీసులు గుర్తించిహత్యకు పాల్పడింది కవితగా నిర్ధారించారు.ఇందుకు సీసీ కెమెరా ఫుటేజీ కీలకంగా మారింది. సీసీ కెమెరా ఏర్పాటు చేసిన శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తిని ఏసిపి సన్మానించారు.అపహరించిన బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్ దుండిగల్ పోలీసులు

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *