దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిన చెరువులు. దోమల ఉత్పత్తితో అధికారులకు లాభమే!?

గంగారం చెరువు వద్ద బిజెపి నాయకులు ధర్నా
గంగారం చెరువు వద్ద బిజెపి నాయకులు ధర్నా

దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిన చెరువులుచందానగర్ గంగారం పెద్ద చెరువు వద్ద బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు.గుర్రపు డెక్క, మురుగునీరుతో గంగారం పెద్ద చెరువు దోమల ఉత్పత్తి కేంద్రంగా మార్చాయి. దీంతో సమీపంలో ఉన్న కాలనీ వాసులు సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటే హడలిపోతున్నారు.ముసురుతున్న దోమలు తో బయట అడుగు పెట్టలేకపోతున్నాము.జిహెచ్ఎంసి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. దోమలకు ఉత్పత్తి కేంద్రంగా ఉన్న చెరువును వెంటనే శుభ్రం శుభ్రం చేయాలంటూ నినాదాలు చేశారు.బిజెపి నాయకులు ధర్నాకు స్థానికులు సంఘీభావం ప్రకటించారు.వినూత్న రీతిలో వైఎన్ ఆర్ గ్రీన్ హిల్స్అపార్ట్‌మెంట్ పక్కన మదీనాగూడ పీజేఆర్ రోడ్ లో ధర్నా చేశారు. చందానగర్ డివిజన్ బిజెపి నేత కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి నేతృత్వంలో శనివారం ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ ఎం రవి కుమార్ యాదవ్,ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారుఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రసంగించారు.ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమీలేదని, పెద్ద ఎత్తున భూకబ్జాలు, పర్యావరణాన్ని నాశనం చేసే చర్యలు , వాయు కాలుష్యానికి తోడు విచ్చలవిడిగా దోమల స్వైర విహారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బిజెపి ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సంవత్సరాలుగా గంగారం పెద్ద చెరువు అభివృద్ధి పేరుతో కోట్లు రూపాయలు లూటీ చేశారు.సుందరీకరణ పేరుతో చెరువులో నీరు నిలువ లేకుండా ఖాళీచేసి కబ్జాలకు ఊతమిచ్చారు.గుర్రపు డెక్క, మురికి జలాలతో చెరువుని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు సమీపంలో నివాసం ఉంటున్న కాలనీవాసులు దోమలు స్వైరవిహారంతో అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కసిరెడ్డి సింధు రెడ్డి మాట్లాడుతూ చందానగర్, దీప్తిశ్రీనగర్ పరిసర ప్రాంతాల్లోని కాలనీలలో సాయంత్రం అయ్యిందంటే చాలు దోమలు విపరీతంగా ఇళ్లలోకి చొరబడి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.గతంలో ఇంత దుర్భర పరిస్థితులు ఎప్పుడూ లేవని అన్నారు. ప్రజా సమస్యల గాలికి వదిలి సొంత లాభం చూసుకుంటున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు.బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గంగారం చెరువు విషయంలో నియంత్రణ లేకుండా వదిలేసిన మురుగునీరు, గుర్రపు డెక్క కారణంగా దోమల పెంపకం కేంద్రంగా మారిపోయిందని ఆరోపించారు.పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారని చెప్పారు. గంగారం పెద్ద చెరువు ప్రక్షాళన జరిగే వరకూ తాము విశ్రమించబోమని శేరిలింగంపల్లి ప్రజలంతా ఒక్కటై సర్కారు మొద్దు నిద్ర పోయేవరకు ఉద్యమ శంఖారావం పూరించడానికి సంసిద్ధంగా ఉండాలన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *