సుబ్రహ్మణ్యం హత్య కేసులతో సంబంధం ఉన్న పోలీసు అధికారుల అరెస్టు చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ బూసి వెంకటరావు
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ బూసి వెంకటరావు

విశాఖ, (విశాల జ్యోతి)

వీధి సుబ్రమణ్యం హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన పోలీసులను సస్పెన్షన్ కాదు తక్షణమే అరెస్టు చేయాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు. సుబ్రమణ్యం హత్య కేసు పునః దర్యాప్తు నిమిత్తం ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మనీష్ నేతృత్వంలోనీ సిట్ నివేదిక బహిర్గతం చేయాలన్నారు.సుప్రీంకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో అనంత బాబు భార్యతో పాటు పోలీసు అధికారులును తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ విదసం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విశాఖ గాంధీ విగ్రహం వద్ద నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట రావు మాట్లాడుతూ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల అనుమానాస్పద వైఖరి పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపద్యంలో దోషులతో కుమ్మక్కైన పోలీసు అధికారులను సస్పెన్షన్ తో సరిపెట్టకుండా చార్జిషీట్ లో పేర్లు చేర్చాలని వెంకట రావు డిమాండు చేసారు.

హత్య కేసు నిందితులను రక్షించిన అధికారులపై చర్యలు చేపట్టాలి

ఈ కేసులో లో మొదటి నుండి అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ హత్య పై సీబీఐ విచారణ కోసం విదసం నాయకత్వం నాటి గవర్నర్ ను , కూటమి సర్కారు లో హామ్ మంత్రికి విజ్ఞప్తి చేసిన క్రమంలో ప్రభుత్వం ఐపీఎస్ అధికారి తో సిట్ వేసిందన్నారు .. సిట్ చార్జిషీట్ లో ఏ 2 గా అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గను చేర్చినప్పటికీ ఆమెను ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. లక్ష్మీ దుర్గ పారిపోయేoదుకు సహరించిన అధికారులను కూడా చార్జిషీట్ లో చేర్చాలన్నారు. . ఈ కేసులో ఎమ్మెల్సీ భార్య లక్ష్మీ దుర్గను కాపాడి సాక్ష్యాలను తారుమారు చేసిన నాటి పోలీసు అధికారుల పై రెడ్ విత్ 34, ఐపీసీ 193, 201,208 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ 4 ప్రకారం నిందితులుగా చేర్చి వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో జాజి ఓంకార్, సోడదాసి సుధాకర్ , గుడివాడ ప్రసాద్, యు ఎస్ రాజు, గుడివాడ భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *