నష్ట పరిహారం కోటి రూపాయలకు పెంచి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

 

విశాల జ్యోతి వేట్ల పాలెం

సిట్టింగ్ న్యాయ ముర్తిచే విచారణ జరపాలి:విదసం డిమాండ్

వెట్లపాలెం పేలుడు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని, ప్రమాదంపై సిటింగ్ న్యాయ మూర్తి చే విచారణ జరిపించాలనీ విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు.
వెట్లపాలెం బాధిత కుటుంబాలు గొడత మహేష్ భార్య శ్యామల, గొడత చాందిని తల్లిని, మందపల్లి చిన్ని కొడుకు శ్రీనివాసరావును , గొడత వీరవేంకట రమణ కుటుంబ సభ్యులను విదసo ఐక్య వేదిక ప్రతినీదులు ఆదివారం పరామర్శించారు.ఈ సందర్భంగా వెంకట రావు మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో మరణాలు పరిశ్రమలో భద్రతా నిర్లక్ష్యంమే కారణమని మృతుల కుటుంబాలకు ప్రభుత్వo ప్రకటించిన నష్ట పరిహారం కోటి రూపాయలకు పెంచాలన్నారు. నష్ట పరిహారం తోపాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్సు సమకూర్చి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని డిమాండు చేసారు..

అనుమతులు మంజూరు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

బాణసంచా పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట మైన చర్యలు తీసుకోవడంలో పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు పెరిగాయని వేటపాలెం ప్రమాదం పై సిటింగ్ న్యాయ మూర్తిచే విచారణ జరపాలన్నారు. బాధితులకు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 2 ఎకరాలు పంట భూమి కొనివ్వాలని,యజమాని ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధిత కుటుంబాలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు..లైసెన్స్ మంజూరులో , భద్రతా చర్యలు ఉల్లంఘన లో లాలూచీ పడ్డ అధికారులను విధులనుండి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండు చేసారు..ఈ కార్యక్రమంలో గోడి వెంకటేశ్వర రావు, గుడివాడ ప్రసాద్, చక్క రాంబాబు, పావాడ సన్యాసిని రావు, గుబ్బల శ్రీనివాసరావు, వి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *