బొల్లారం 272 డివిజన్‌లో బీజేపీలోకి భారీ చేరికలు: ఆనంద్ కృష్ణారెడ్డి

బొల్లారం బిజెపిలో భారీ చేరికలు

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బొల్లారం 272 డివిజన్ వినాయక నగర్ కాలనీకి చెందిన పలువురు బీజేపీ లో చేరారు.జిల్లా అధ్యక్షురాలు గోదావరి సమక్షంలో బిజెపిలో చేరారు.లక్ష్మీదేవి,ఆమె కుమారుడు తన బృందంతో కలిసి సుమారు 100 మంది కార్యకర్తలు మంగళవారం సాయంత్రం భారతీయ జనతా పార్టీలో చేరినట్లు.బీజేపీ నాయకులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి చెప్పారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ..దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి పనులు బొల్లారంలో కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటూ చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఆనంద్ రెడ్డి తో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.అనంతరం జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి బీజేపీ సిద్ధాంతాలను నమ్మి వస్తున్న కార్యకర్తలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, పార్టీ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ చారి జనరల్ సెక్రెటరీ అఖిల్, అరుణ్, విష్ణు చారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *