బొల్లారంలో విషాదం:అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

.

బొల్లారంలో విషాదం:అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న చెడు వ్యసనాలు.

అనాదులుగా మారుతున్న వృద్ధ తల్లిదండ్రులు 

భరోసానిచ్చిన బిజెపి పట్టణ అధ్యక్షుడు కే.జే.ఆర్. ఆనంద్ కృష్ణారెడ్డి

బొల్లారం 272 డివిజన్ పరిధిలో నిరుపేద కుటుంబంలో తీవ్ర విషాదం

 

గత రెండు దశాబ్దాలుగా బొల్లారంలో నివసిస్తూ వంట మాస్టర్‌గా జీవనం సాగిస్తున్న రాజు అనే వ్యక్తి అనారోగ్యం ఆత్మహత్యకు పాల్పడ్డారు.మృతుడు రాజు గత కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు.దానికి తోడు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.షుగర్, చివరి దశలో ఉన్న క్యాన్సర్ అతని జీవితాన్ని కుంగదీశాయి. నాలుగు నెలల క్రితమే భార్యను కోల్పోయిన రాజు తీవ్రవాదనకు గురయ్యాడు, వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో నరకయాతన పడ్డాడు.ఆయన వర్ణనాతీతం. నన్ను చూసుకునే వారు లేరు, ఈ బాధ భరించలేను అంటూ తీవ్ర క్షోభకు గురయ్యాడు.ఈ ఆవేదనతో అర్ధరాత్రి ఉరివేసుకుని తనువు చాలించారు. కొడుకు సంపాదనపైనే ఆధారపడి బతుకుతున్న వృద్ధ తల్లిదండ్రులు దళపతి రావు, సూర్య కుమారిలు పేదన వర్ణనాతీతం. తమకు కొరివి పెడతాడు అనుకున్న కొడుకు మిగతాజీవుగా పడిఉండడం చూసి కలత చెందారు.ఈ హృదయ విదారక ఘటన గ తెలిసిన వెంటనే బిజెపి పట్టణ అధ్యక్షుడు కే.జే.ఆర్. ఆనంద్ కృష్ణారెడ్డి బాధితుల నివాసానికి చేరుకున్నారు. రాజు భౌతికకాయానికి నివాళులర్పించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కన్నీరుమున్నీరవుతున్న ఆ వృద్ధ తల్లిదండ్రులను ఓదార్చారు. తక్షణ సాయం కింద అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం నగదు అందజేశారు. మేమంతా అండగా నిలబెడతామంటు వృద్ధ దంపతులకు భరోసా ఇచ్చారు.మీ ఇంటి బిడ్డగా నేనున్నాననే ధైర్యం వారికి కల్పించారు. ఏ కష్టం వచ్చినా నేరుగా తనకు ఫోన్ చేయాలని వారికి భరోసానిచ్చారు.ఈ సందర్భంగా ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “మద్యం మహమ్మారి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, కన్నవారిని అనాథలను చేసింది. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు మీ తల్లిదండ్రులను వీధిన పడేస్తాయని గుర్తించండి. ప్రాణం ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోండి అంటూ హితవు పలికారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *