ఘనంగా రవికుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు
కార్యకర్తలు అభిమానుల సందడి మధ్య కేక్ కట్ చేసిన రవి
వెల్లువల శుభాకాంక్షలు ,

శేరిలింగంపల్లి విశాల జ్యోతి
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం మసీద్ బండ బిజెపి పార్టీ కార్యాలయంలో అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువత, అభిమానులు ప్రతి కార్యాలయానికి తరలివచ్చారు. రవికుమార్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు పూలమాలలు, శాలువాలతో రవికుమార్ యాదవ్‌ను సన్మానించి అభినందనలు తెలియజేశారు. ప్రాంగణం మొత్తం జన్మదిన శుభాకాంక్షల ఫ్లెక్సీలు, బ్యానర్లతో కళకళలాడింది. కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.. ఈ సందర్భంగా మక్త మహబూబ్ పేట నాయకులు రాజేష్ గౌడ్ మాట్లాడుతూ రవికుమార్ యాదవ్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న కృషి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అలాగే యువతకు ప్రోత్సాహం అందిస్తూ పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో రవికుమార్ యాదవ్ కీలక పాత్ర ప్రశంసనీయమన్నారు.. రానున్న రోజుల్లో ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.