రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా దుర్గం శ్రీహరి గౌడ్ నియామకం

దుర్గం శ్రీహరి గౌడ్

రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా శేరిలింగంపల్లికి చెందిన దుర్గం శ్రీహరి గౌడ్ నియమితులయ్యారు.కాంగ్రెస్ పార్టీలో 18 ఏళ్ల పాటు అంకితభావంతో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయన చేసిన సేవలను గుర్తించి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ దుర్గం శ్రీహరి గౌడ్‌ను రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా నియమించింది.శ్రీహరిగౌడ్ తన రాజకీయ ప్రస్థానాన్ని శేరిలింగంపల్లిలో సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా ప్రారంభించారు.అంచలంచెలుగా ఎదిగి శేరిలింగంపల్లి డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా,చెవెళ్ల పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, డివిజన్ ఇన్‌చార్జ్ గా, తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా పనిచేశారు.చెవెళ్ల లోక్‌సభ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా కూడా సేవలందించారు. భారత్ జోడో యాత్రలో కీలకంగా వ్యవహరించారు.మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు,బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కార్యక్రమాలు, యువత సమీకరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించి పార్టీలో గుర్తింపు పొందారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగించే కంటెంట్ గుర్తించి వాటిని ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం చేశారు.క్షేత్రస్థాయిలో కేడర్ ను సమీకరించి పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేశారు.కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత గుర్తించిన అధిష్టానం జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *