అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కె ఎస్ ఆర్ కాలనీ వాసులు పారిశుధ్య లోపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని నెలల నుంచి రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తుంది. మ్యాన్ హోల్ నుంచి మురికి నీరు లీకై రోడ్లగుండా ప్రవహిస్తుండటంతో అక్కడ ఉన్న కాలనీవాసులు దుర్వాసన తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.దీనితో చిన్నారులు మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట లీకై మురికి నీరు ప్రవహిస్తూనే ఉంది.కాలనీవాసులు ఎంతో అసౌకర్యానికి గురౌతున్న మున్సిపల్ అధికారులు శాశ్వత సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదు.రోడ్ నెంబర్ 6,7 లలో నివాసం ఉంటున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇంటి పనుల ఆలస్యమైతే అపరాధ రుసుము వసూళ్ళు చేయడంతో పాటు వేధింపులకు గురి చేసే మున్సిపల్ అధికారులు సమస్య వచ్చినప్పుడు సరిగా స్పందించడం లేదు.స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్, చైర్మన్ పాండురంగారెడ్డి గాని పట్టించుకున్న దాఖలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పన్నులు పెంచి ముక్కుపిండి వసూలు చేసే మున్సిపాలిటీ అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించకపోతే ఆందోళన చేపడుతామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.