*తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలం కాపాడండి
.అమీన్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ కి వినతి
విశాల
తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలం కాపాడాలని కోరుతూ అమీన్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ ప్రదీప్ కుమార్ ను కలిసి బొల్లారం బీజేపీ నాయకులు వినతిపత్రం అందచేశారు.బొల్లారం డివిజన్ పరిధిలోని బీరప్ప గడ్డ(బీరప్ప బస్తి) లో ప్రభుత్వం సర్వే నెంబర్ 284 లోని 0.27 ఎకరాల తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం స్థలం కేటాయించారు. ప్రస్తుతం ఈ స్ధలం అన్యాక్రాంతం అయితుందని సంగారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థలం కాపాడాలని ఇప్పటికే జిన్నారం మండల తాసిల్దార్ కు కోరాగా తాజాగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ను కలిసి అన్ని ఆధారాలతో వినతి పత్రం అందజేశారు.ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం కబ్జా నుండి కాపాడలని వినంతిపత్రంలో పేర్కొన్నారు. ఇందుకు వెంటనే స్పందించిన అమీన్ పూర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ ప్రదీప్ కుమార్ స్పందించారు.స్థలాన్ని రక్షిస్తామని హామీ ఇచ్చారు. కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి రక్షణ ఏర్పాట్లు చేయాలని టౌన్ ప్లానింగ్ ఏసీపీ కి ఆదేశాలు జారీ చేశారు.అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు జి. రాఘవేంద్ర రెడ్డి, బొల్లారం డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు వి. శ్రీకాంత్ చారి ఉన్నారు.