బొంగునూరి కిషోర్ రెడ్డి ( బి కే ఆర్) ఆధ్వర్యంలో చలివేంద్రాలు

బికేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.
291,293,294,295 డివిజన్లోని, షాపూర్ నగర్,సూరారం,గండిమైసమ్మ, బౌరంపేట డివిజన్లలో ఒకే రోజు ఐదు చోట్ల చలి వేంద్రాలు ఏర్పాటు చేసినట్లు యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ కో ఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి తెలిపారు.తమ బికేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.వేసవికాలం కావడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.త్రాగడానికి రోడ్డున వెళ్ళే ప్రజలకి దాహం తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బొంగునూరి కిషోర్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,బికేఆర్ ఫౌండేషన్ సభ్యులు, బెంబిడి హనుమంత్ రెడ్డి,దర్శన్ యాదవ్, నరసింహ రెడ్డి,మహేందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి,బొబ్బల నరసింహ రెడ్డి, గజానంద్,మహేష్,కార్తీక్ రెడ్డి, బాబన్ నదీం,విక్రాంత్,గంట శివారెడ్డి,రమేష్,జగదీష్,జగన్,తిరుపతి రెడ్డి, బొంగునూరి భరత్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *