ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ వైస్ చైర్మన్ గా బొంగునూరి కిషోర్ రెడ్డి నియామకం.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ వైస్ చైర్మన్ గా బొంగునూరి కిషోర్ రెడ్డి నియమించారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ వైస్ చైర్మన్ గా బొంగునూరి కిషోర్ రెడ్డి నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఎఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల జారీ చేశారు.రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ గా హెచ్ వేణుగోపాల్ రావు నియమించగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి ని రాష్ట్ర ప్రోటోకాల్ వైస్ చైర్మన్ గా నియమించారు.సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నారు.ఎలాంటి పదవులు లేకపోయినా పార్టీ పటిష్టత కోసం సాధారణ కార్యకర్తగానే పనిచేశారు. బాధ్యతయుతమైన కార్యకర్తగా కొనసాగుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. బొంగు నూరి కిషోర్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నరు. ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలతో మమేకమై  రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి ప్రోటోకాల్ వైస్ చైర్మన్ గా నియమించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రోటోకాల్ వైస్ చైర్మన్ గా కిషోర్ రెడ్డి నియమించడం పట్ల మహేందర్ రెడ్డి హర్ష వ్యక్తం చేశారు. కష్టపడితే పదవులు వాటి అంతట అవే వస్తాయని చెప్పడానికి కిషోర్ రెడ్డి నియామకమే ఉదాహరణగా చెప్పవచ్చు అన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *