దేశ ప్రయోజనాలు అమెరికాకు తాకట్టు పెట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం

భారత్ – అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలని యువజన కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు రాయపాటి హరీష్ డిమాండ్ చేశారు.

స్కూటర్ ర్యాలీగా తరలి వెళ్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు
స్కూటర్ ర్యాలీగా తరలి వెళ్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు

భారత్ – అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలని యువజన కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు రాయపాటి హరీష్ డిమాండ్ చేశారు.2026 ఫిబ్రవరిలో కుదిరిన ఈ ఒప్పందం దేశీయ పరిశ్రమలకు,రైతుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి బైక్ ర్యాలీతో తరలివెళ్లారు.కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు.పి సి సి ఉపాధ్యక్షులు, కూకట్ పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో వారంతా తరలివెళ్లారు.ఈ సందర్భంగా రాయపాటి హరీష్ మాట్లాడుతూcవాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం పార్లమెంటుతో పాటు దేశ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుండి వ్యవసాయ, పాడి ఉత్పత్తులను భారీగా దిగుమతి చేసుకోవడం వల్ల స్థానికంగా ఉన్న రైతులు,చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశ ప్రజల ప్రయోజనాలు కంటే వ్యాపార ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.అమెరికన్ వస్తువులపై సుంకాలను తగ్గించడం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడుతుందని, ఇది మేక్ ఇన్ ఇండియాకు విఘాతం కలిగిస్తుందని హరీష్ వాపోయారు.చమురు కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని, ఇది కేంద్ర ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం అన్నారు. గ్యాస్ ఉత్పత్తులో అందుబాటులో లేక ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్లకు తరలి వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు ఎం డి సలీం, బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, నాయకులు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *