
హల్లో ముదిరాజ్ – ఛలో గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందుగా తెలియజేసినప్పటికీ, ముదిరాజ్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని మాదాపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కుల సంఘాల హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కును కాలరాయడం రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడే హక్కు ప్రతి పౌరుడికి ఉంది.అలాంటి హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.ముదిరాజ్ వర్గం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది.ఈ అక్రమ అరెస్టులను వెంటనే ఉపసంహరించుకుని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
