
దుండిగల్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని కె.వి.ఆర్ వ్యాలీ, స్ప్రింగ్ వుడ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు సమస్యలతో సతమతమవుతున్నారు.రక్షిత మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ వాసులు పలు సమస్యలపై కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.స్ప్రింగ్ వుడ్ గేటెడ్ కమ్యూనిటీలో కాలనీ వాసులతో కలిసి హనుమంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం క్లబ్ హౌస్ లో కాలనీ వాసులతో కలిసి సమావేశం నిర్వహించారు.కాలనీలో గత ప్రభుత్వ హయాంలో పార్కులు కబ్జాకు గురయ్యాయని వాటిలో కొన్ని రక్షించుకోగలిగామని హనుమంత్ రెడ్డి తెలిపారు. మరికొన్ని పార్కులు ఆక్రమించి నిర్మాణాల చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.కబ్జా స్థలాల్లో ఇల్లు కట్టుకొని నివాస ఉంటున్న వారికి ఏమీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. మంజీరా నీటి సరఫరా కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసికోరతానని హామీ ఇచ్చారు.భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరులు నిరుపయోగంగా మారాయని తాగునీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇక్కడ 20 ఏళ్ళుగా నివాసం ఉంటున్నామని తమకు మంజీరా తాగునీటి సరఫరా చేయాలని కోరారు.ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న తమ కాలనీకి మంజీరా నీటి సరఫరా చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ అంతర్గత రోడ్లు పూర్తిగా పాడయ్యాయని వాటిని నిర్మించాలని పలమార్లు ఎమ్మెల్యే ను కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందనీ కాలనీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో మురికి నీటిని తరలించే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదని సివేస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు.20 ఏళ్ల నుంచి జీవనం కొనసాగిస్తున్నామని ఇక్కడ ప్రస్తుతం 30 వేల వరకు జనాభా నివాసం ఉంటున్నారని తాగు నీరు,డ్రైనేజీ ,రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి దృష్టికి తీసుకోని వచ్చారు.
ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.