లోహరిబంద గ్రామంలో కిలమ్మ తల్లి దేవాలయాల ప్రారంభోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో మొదటి ఘట్టం అమ్మవార్ల ఊరేగింపు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభం అయ్యింది.ఊరగింపు కార్యక్రమం ఆట పాటలతో బాజా భజంత్రీలతో కోలాహలంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఘటాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఊరగింపు లోహరిబంద నుంచి యశోధనగర్, నర్తు వాళ్ళ తోటలు మీదగా ఊరగించుకొని అమ్మవారి గుడి దగ్గరకు చేర్చడంతో అమ్మవార్ల ప్రధాన ఘట్టం ప్రారంభం అయినట్లు నిర్వాహకులు తెలిపారు.
మహిళలు ఒకే రంగు వస్త్రాలు ధరించి కార్యక్రమంలో పాల్గొనడం ఆకర్షించింది.

ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి రథం
శ్రీ కిల్లమ్మ తల్లి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూలరధంతో ఊరేగింపు కోలాహలంగా నిర్వహించారు .సోమవారం సా॥ 3 గంటల నుండి పూలరధములో శ్రీశ్రీశ్రీ కిల్లమ్మ తల్లి అమ్మవారిని అత్యంత వైభవముగా అలంకరించారు.పుష్పరధం పై కొలుపై ఉండగా ముత్తైదువులు వెంట నడవగా, ఆటపాటలతో మేళతాళాలతో కోళాటం, గరిడి, కళికమ్మ వేషదారులతో ముందు నడుస్తూ ఉండగా, గ్రామ ప్రజలు నిండు భక్తి భావముతో రధాల వెంటరాగా వైభవముగా గ్రామ పురవీధుల వెంట అమ్మవారిని ఊరేగడం గ్రామస్తులను మైమరిపించింది.