ఇక టెక్ కంపెనీలకు మానవ వనరుల సమీకరణ సులభతరం
ఏ ఐ పాంటిస్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన కేటీఆర్

విశాల జ్యోతి శేరిలింగంపల్లి
హైదరాబాద్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ సంస్థ ‘పాంటిస్’ (PONTIS) సరికొత్త వెబ్‌సైట్‌ను తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ శరత్ చంద్ర, డైరెక్టర్లు వినయ్, ప్రతీక్ లతో కూడిన యువ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రం నేడు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్‌లకు ఒక గ్లోబల్ హబ్’గా (Global Hub) రూపాంతరం చెందుతోందని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. స్థానిక యువత అంతర్జాతీయ ప్రమాణాలతో డీప్-టెక్ (Deep-Tech) ప్రొడక్ట్స్‌ను రూపొందించడం గర్వకారణమని, రిక్రూట్‌మెంట్ రంగాన్ని సులభతరం చేసే ఈ సాంకేతికత అద్భుతమైన విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలకు సరైన ప్రతిభ గల అభ్యర్థులను ఎంపిక చేయడం సవాలుగా మారింది. ముఖ్యంగా హెచ్ ఆర్ స్క్రీనింగ్ అనేది ఒక పెద్ద సమస్య గా మారింది. సాంప్రదాయ పద్ధతుల్లో వందలాది రెజ్యూమెలను ఫిల్టర్ చేయడానికి, అభ్యర్థులతో ప్రాథమిక సంభాషణలు జరపడానికి రోజుల తరబడి సమయం వృధా అవుతోంది. ఇది కంపెనీలకు రిక్రూట్ చేసుకుని మేనేజర్లకు సమస్యగా పరిణమిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ యువ టెక్కీలు’పాంటిస్ పేరుతో సమస్యకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారం చూపడమే ధ్యేయంగా సరే కొత్త విప్లవానికి నాంది పలికారు.పాంటిస్ ప్లాట్‌ఫారమ్ రూపొందించారు. ఇది కేవలం రెజ్యూమెలను స్కాన్ చేసే సాధారణ టూల్ కాదు. ఉద్యోగాల కోసం వివిధ వేదికలలో అభ్యర్థి అప్లై చేసుకున్న ,అప్లోడ్ చేసిన రెజ్యూమ్ లను వెంటనే స్కాన్ చేస్తుంది.పాంటిస్ రూపొందించిన టూల్ స్వయంగా అభ్యర్థితో మాట్లాడి వారి నైపుణ్యాలను అంచనా వేసే ఏజెంటిక్ ఏఐ ఆధారిత వాయిస్ స్క్రీనింగ్ వ్యవస్థను తెలియజేసే సాంకేతికతను ఈ బృందం విజయవంతంగా అభివృద్ధి చేసింది.రోజుల తరబడి సాగే సుదీర్ఘ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఇక కేవలం కొన్ని నిమిషాల్లో ముగించి, కంపెనీలకు అత్యంత ఖచ్చితమైన షార్ట్‌లిస్ట్‌ను అందించడమే ‘పాంటిస్’ ముఖ్య లక్ష్యం. అదే సమయంలో ఉద్యోగార్థుల రెజ్యూమ్ లు ఎక్కడా నిలిచిపోకుండా, వారికి తక్షణమే తమ ప్రతిభను నిరూపించుకునేలా పారదర్శకమైన అవకాశాన్ని కల్పించాలని ఈ సంస్థ భావిస్తోంది. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్‌ప్రైజ్ నియామకాల రంగాన్ని పూర్తిగా మార్చేసి, సమయాన్ని, శ్రమను ఆదా చేసే అంతర్జాతీయ స్థాయి డీప్-టెక్ బ్రాండ్‌గా ఎదగడమే తమ తుది గమ్యమని సంస్థ నిర్వాహకులు శరత్, వినయ్, ప్రతీక్ లు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ కొత్త ఆలోచనలు ఆవిష్కరించిన టేకీలను అభినందించారు. ఉద్యోగుల సృష్టించే వ్యవస్థను క్రియేట్ చేయాలని ఇందుకు సరైన ప్రోత్సాహకాలు అందించాలని కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్దబోయిన పురుషోత్తం యాదవ్ పాల్గొన్నారు.
