ప్రజల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని యువజన కాంగ్రెస్ నాయకులు రాయపాటి హరీష్ కోరారు. అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు.మూసాపేట వసుందర వెనుక భాగంలో ఉన్న శ్రీహరి నగర్ లో విద్యుత్ దీపాలు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ దీపాలు వెలగడం లేదనే విషయాన్ని కాలనీవాసులు యువజన కాంగ్రెస్ నాయకులు రాయపాటి హరీష్ దృష్టికి తీసుకొని వచ్చారు. సమస్య తీవ్రత గుర్తించిన హరీష్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.కాలనీలో విద్యుత్ దీపాలు వెలగని స్తంభాలు గుర్తించి నూతన లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో చీకట్లో పోయి వెలుగు రావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకొని వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

ఇది కూడా చదవండి
సెంట్రింగ్ కార్మికులు సమ్మె విరమించకపోతే అంతే సంగతులు