పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి:
వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
తెలంగాణ రక్షణ సేన బలోపేతంపై దృష్టి పెడదాం
ప్రజల సమస్యలు పరిష్కారం పై దృష్టి పెట్టాలి
ప్రజలకు చేరువయేందుకు ఇది ఒక చక్కటి మార్గం
శేర్లింగంపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ సత్తా చాటాలి
విశాల జ్యోతి శేరిలింగంపల్లి

ప్రజల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి ఇన్చార్జ్ వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు లెక్కలు చెబుతున్న అందుకు తగ్గ అభివృద్ధి జరగకపోవడం వెనక ఉన్న అంతర్యాన్ని ప్రజలు ప్రశ్నించాలన్నారు. మియాపూర్, మక్త మహబూబ్ పేటకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా వాసలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ లో చేరారు.వారందరినీ అధ్యక్షరాలు కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.సోమవారం జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయంలో భారీగా తరలి వచ్చిన కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించారు.. ఈ సందర్భంగా వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. శేరిలింగంపల్లిలో తెలంగాణ రక్షణ సేన పార్టీ సిద్ధాంతాలు పాంచజన్యంని ప్రజల్లోకి తీసుకొని వెళ్తామన్నారు. దయానంద ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆఫీస్ లో కవిత సమక్షంలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.గుండె లక్ష్మి ముదిరాజ్, గోపాల్ ముదిరాజ్, ప్రభు, ప్రభాకర్, స్వామీగౌడ్, ఘాపూర్, సయ్యద్, అక్బర్, అలీ, రాజు, అస్లాం,ప్రశాంత్,సువర్ణ , పుష్పమ్మా, లక్ష్మి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్,స్టేట్ జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి,కిషోర్,లావణ్య బండారి,సందీప్ పాల్గొన్నారు.