
లోహరిబంధ గ్రామంలో సర్వేలో జరిగిన తప్పిదాల గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఓ రైతుకు 22 సెంట్ల భూమి 9 సెంట్లకే పరిమితం..మరో రైతుకు సంబంధం లేని భూములు సంక్రమించేలా చేశారు.మరి కొంత మంది కి ఎక్కువ నమోదు అయ్యేలా పత్రాలు పంపిణీ చేశారు.వన్‌బీ రికార్డులు, యాజమాన్య పత్రాలు పరిశీలించినా తప్పులేనా?క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే జరిగిందా? జరిగిన తప్పిదాలకు సర్వేయర్ ,విఆర్ఓ ఎవరు బాధ్యత వహించాలి. రైతుల ఆరోపణలపై అధికారులే సమాధానం చెప్పాలి.
లోహరిబంధలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, భూ రికార్డులను ప్రక్షాళన చేయడం, వాస్తవ భూ విస్తీర్ణం–యాజమాన్య వివరాలను నమోదు చేయడం లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేలోనే తప్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నాయి.
లోహరిబంధ గ్రామంలో చేపట్టిన భూ సర్వే, డేటా నమోదు ప్రక్రియపై పలువురు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సర్వే అనంతరం భూ రికార్డులను పరిశీలించిన ఓ భూయజమాని తనకు వాస్తవంగా ఉన్న 22 సెంట్ల భూమిలో కేవలం 9 సెంట్లు మాత్రమే నమోదు చేసినట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, తనకు సంబంధం లేని మరో సర్వే నంబర్లో తన పేరుపై 10 సెంట్ల భూమి నమోదు చేసినట్లు గుర్తించామని ఆయన పేర్కొంటున్నారు.ఇలాంటి నమోదు తప్పిదాలు మరికొందరి భూ యజమానుల విషయంలోనూ ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకరి భూమి విస్తీర్ణం తగ్గిపోవడం, మరొకరి పేరుపై సంబంధం లేని సర్వే నంబర్ నమోదవడం వంటి అంశాలు భవిష్యత్తులో తీవ్రమైన భూ వివాదాలకు దారితీసే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సమాచారం ఇచ్చినా.. తప్పులు ఎలా జరిగాయి?
సర్వేయర్ల వాట్సాప్ గ్రూపుల ద్వారా ముందస్తు సమాచారం ఇవ్వడంతో సర్వే జరిగిన రోజున భూ యజమానులు తమ వద్ద ఉన్న యాజమాన్య పత్రాలు, సంబంధిత రికార్డులతో అధికారుల సమక్షంలో పాల్గొన్నారు. అధికారులు తమ వద్ద ఉన్న భూ రికార్డులతో పాటు రైతులు సమర్పించిన వన్‌బీ పత్రాలను పోల్చి చూసిన తప్పులు దొర్లడం సర్వేయర్ల నిర్లక్ష్యమే కారణం. భూ విస్తీర్ణాలు, సర్వే నంబర్లు, యాజమాన్య వివరాల్లో తేడాలు ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
క్షేత్రస్థాయిలో కొలతలు జరిగాయా?
భూ సర్వేలో అత్యంత కీలకమైన అంశం క్షేత్రస్థాయిలో వాస్తవ భూమిని గుర్తించి కొలతలు చేపట్టడం. అయితే గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయి కొలతలు చేపట్టకుండానే రైతుల రికార్డులు, పత్రాల ఆధారంగా వివరాలు నమోదు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.సర్వే అధికారులు వాస్తవ భూమి హద్దులు, విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో నిర్ధారించారా? నిర్ధారించి ఉంటే ఒక భూ యజమాని పేరుపై సంబంధం లేని సర్వే నంబర్లో భూమి ఎలా చేరింది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వీఆర్వో–సర్వేయర్ల మధ్య సమన్వయం ఎక్కడ?
సర్వే ప్రక్రియలో రెవెన్యూ అధికారులు తమకు తగిన సహకారం అందించలేదని సర్వేయర్లు మరోవైపు సర్వేలో జరిగిన తప్పిదాలకు సర్వేయర్లదే బాధ్యత అన్నట్లుగా వీఆర్వో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకోవడం వల్ల అసలు తప్పిదం ఎక్కడ జరిగిందన్నది స్పష్టంగా తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొంతమందికి మేలు.. మరికొందరికి నష్టం చేశారా?
సర్వే నివేదికలో కొంతమంది భూ యజమానులకు అనుకూలంగా, మరికొందరికి నష్టం కలిగించే విధంగా వివరాలు నమోదు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి డేటా ఎంట్రీ తప్పిదాలా? క్షేత్రస్థాయి సర్వేలో నిర్లక్ష్యం కారణంగానే సమస్యలు తలెత్తాయా? అన్నది రికార్డుల సమగ్ర పునఃపరిశీలన, క్షేత్రస్థాయి రీ-సర్వే ద్వారా మాత్రమే తేలాల్సి ఉంది.
ఇప్పుడు కీలక ప్రశ్నలు ఇవే..
సర్వేకు ముందు ఉన్న రికార్డులను అధికారులు పూర్తిగా పరిశీలించారా?వన్‌బీ పత్రాలను సంబంధిత రికార్డులతో సరిపోల్చారా?ప్రతి భూమికి క్షేత్రస్థాయిలో వాస్తవ కొలతలు చేపట్టారా? అసలు తప్పిదం ఎవరిది?ఒకరి పేరుపై సంబంధం లేని సర్వే నంబర్లో భూమి ఎలా నమోదైంది?సర్వే డేటాను నమోదు చేసే ముందు భూ యజమాని నుంచి ధృవీకరణ తీసుకున్నారా?సర్వే సమయంలో తీసిన కొలతలు, స్కెచ్‌లు, పంచనామాలు, సంబంధిత డిజిటల్ రికార్డులు అందుబాటులో ఉన్నాయా?సర్వేలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహించేది రెవెన్యూ అధికారులా? సర్వేయర్‌లా? డేటా ఎంట్రీ వ్యవస్థనా?
రీ-సర్వేకు రైతుల డిమాండ్
భూ రికార్డుల్లో తప్పులు ఉన్నట్లు భావిస్తున్న ప్రతి భూ యజమాని సంబంధిత పత్రాలతో సచివాలయాన్ని ఆశ్రయిస్తున్నారు.అంతేకాకుండా గ్రామంలో చేపట్టిన సర్వే రికార్డులను స్వతంత్రంగా పునఃపరిశీలించి, అవసరమైన చోట్ల క్షేత్రస్థాయిలో రీ-సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.భూమి అనేది రైతుకు జీవితకాల ఆస్తి. సర్వేలో జరిగిన చిన్న తప్పిదం కూడా భవిష్యత్తులో యాజమాన్య వివాదం, కోర్టు కేసు లేదా భూమి కోల్పోయే పరిస్థితికి దారితీయవచ్చు. అందువల్ల లోహరిబంద భూ సర్వేలో నమోదైన ప్రతి విస్తీర్ణం, ప్రతి సర్వే నంబర్, ప్రతి యాజమాన్య వివరాన్ని పాత రికార్డులు–వన్‌బీ–క్షేత్రస్థాయి కొలతలు–ప్రస్తుత నమోదుతో సరిపోల్చి అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది
.
సర్వే తప్పిదాలకు ఎవరిది బాధ్యత?
లోహరి బంద రైతులు కోరుతున్నది ఒక్కటే—భూమి ఎంత ఉందో అంతే రికార్డులో ఉండాలి.. ఎవరి భూమి వారిదే కావాలి.ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన సమగ్ర భూ సర్వే ప్రధానంగా పాత భూ రికార్డులను ఆధునీకరించడం, భూమి హద్దులు–విస్తీర్ణాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా గుర్తించడం, యాజమాన్య హక్కులకు స్పష్టత కల్పించడం, భూ వివాదాలను తగ్గించడం అనే లక్ష్యాలతో చేపట్టారు.
డిజిటలైజేషన్ చేసేందుకే
ఏపీలో అనేక గ్రామాల ప్రాథమిక సర్వే రికార్డులు దశాబ్దాల క్రితం, కొన్ని ప్రాంతాల్లో 100 ఏళ్లకు పైగా క్రితం రూపొందించారు.కాలక్రమంలో భూముల విభజన, అమ్మకాలు, హద్దుల మార్పులు జరిగినా రికార్డులు అదే స్థాయిలో నవీనకరించలేదు.
భూ వివాదాలను తగ్గించడం
ఖచ్చితమైన కాడస్ట్రల్ మ్యాప్‌లు, యాజమాన్య వివరాలు రూపొందించడం ద్వారా సరిహద్దు, యాజమాన్య వివాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.డిజిటల్ భూ రికార్డుల తయారీ
పాత పేపర్ రికార్డులను ఆధునిక డిజిటల్ వ్యవస్థలోకి తీసుకురావడం.భూమి మ్యాప్, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను పరస్పరం అనుసంధానం చేయడం లక్ష్యం.రీ-సర్వేలో డ్రోన్లు, GNSS రోవర్స్, CORS నెట్వర్క్, ఆర్థో-రెక్టిఫైడ్ ఇమేజరీ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించారు.ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు కోసంప్రతి భూ పార్సెల్‌కు Unique Land Parcel Number (LPM) కేటాయించి, దాన్ని WEBLAND వంటి వ్యవస్థలతో అనుసంధానించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది.
ఆ మూడింటిని పరిశీలించాలి
రికార్డులో ఉన్న భూమి–మ్యాప్‌లో ఉన్న భూమి–క్షేత్రస్థాయిలో ఉన్న భూమి” ఈ మూడింటినీ ఒకే విధంగా చేయడం సమగ్ర భూ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశ్యం. లోహరిబంద లో డేటా ఎంట్రీ తప్పిదమా లేదా సర్వే ప్రక్రియలోనే లోపమా అన్నది ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన కీలక అంశం ఏపీలో 17,564 గ్రామాలకు సంబంధించి సర్వే పూర్తి చేశారు. మిగతా గ్రామాల్లో జరిగిన తప్పిదాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
వివాదాల్లో పాత రికార్డులే కీలక ఆధారం
భూముల విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లు, యాజమాన్య హక్కులకు సంబంధించి వివాదాలు తలెత్తినప్పుడు పాత భూ రికార్డులను కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సమగ్ర భూ సర్వేలో ఏమైనా తేడాలు కనిపిస్తే పాత రికార్డులతో కొత్త వివరాలను సరిపోల్చడం ద్వారా అసలు వాస్తవాలను నిర్ధారించవచ్చు.Cadastral Map, 1-B/ROR, Adangal, పాత పహాణీలు వంటి రికార్డులను ముందుగా సేకరించాలి. Settlement Register (RSR) కూడా పరిశీలించాలి. భూ యజమాని వద్ద ఉన్న Pattadar Passbook, రిజిస్టర్డ్ Sale Deed, Gift Deed, Partition Deed తదితర యాజమాన్య పత్రాలను రెవెన్యూ రికార్డులతో పోల్చి చూడాలి. భూమి యాజమాన్యంలో గతంలో మార్పులు జరిగి ఉంటే Mutation Proceedings, Sub-Division Proceedings కూడా కీలక ఆధారాలుగా ఉంటాయి.
లోపం ఉందా?
సర్వేలో అసలు లోపం ఎక్కడ జరిగిందో గుర్తించాలంటే పాత FMB–Village Map–1-B–Adangal–రిజిస్ట్రేషన్ పత్రాలు–కొత్త సర్వే మ్యాప్ మధ్య వివరాలను క్రాస్ వెరిఫికేషన్ చేయాలి. పాత రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం, సర్వే నంబర్, హద్దులకు భిన్నంగా కొత్త రికార్డులు నమోదైతే, అందుకు సంబంధించిన మార్పులకు అధికారిక ఉత్తర్వులు లేదా ప్రొసీడింగ్స్ ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలి.
