తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలం కాపాడండి…
తహసీల్దార్ కి వినతిపత్రం అందచేసిన బొల్లారం బీజేపీ నాయకులు
విశాల జ్యోతి ఐ డి ఎ బొల్లారం
కోటి రూపాయల విలువ చేసే తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలం కాపాడాలంటూ జిన్నారం మండల తహసీల్దార్ అంథోనికి బొల్లారం బీజేపీ నాయకులు వినతిపత్రం అందచేశారు.బొల్లారం డివిజన్ పరిధిలోని బీరప్ప గడ్డ(బీరప్ప బస్తి) లో ప్రభుత్వం సర్వే నెంబర్ 284 లోని 0.27 ఎకరాల తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం స్థలం ఉంది. ప్రస్తుతం ఈ స్ధలం అన్యాక్రాంతం అయ్యింది. కొంత మంది వ్యక్తులు ఈ స్థలాన్ని ఆక్రమించి తమ స్వలాభం కోసం ఉపయోగిస్తున్నారు. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం కబ్జా నుండి కాపాడలని బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి కోరారు.. క్రీడా అవసరాలకు ఉపయోగపడాల్సిన స్ధలంలో ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేయడం పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు జి. రాఘవేంద్ర రెడ్డి, బొల్లారం డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు వి. శ్రీకాంత్ చారి ఉన్నారు.